రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 31:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజు 15వ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సామాజిక తనిఖీలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా డిఆర్డిఓ శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని 15 గ్రామాలలో ఉపాధి హామీ పనులు అభివృద్ధిపై ఫీల్డ్ అసిస్టెంట్లతో విచారణ చేపట్టి సమగ్ర సమాచారం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ ఉపాధి పనుల్లో కూలీలు ఎవరు పని చేస్తున్నారు.జాబ్ కార్డు ఆధారంగా ఎవరు పని చేయడం లేదని అడిగి పూర్తి తెలుసుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో శాజీలోద్దీన్, జిల్లా డిఆర్డిఓ శ్రీనివాసరావు, ఏపీఎంలు ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 62