రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 31:- తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ గత పది ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో చేసిన పని భారతదేశంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఘంటా పదంగా విశ్వాసంతో చెబుతున్నానని అయన అన్నారు.మున్సిపల్ చైర్మన్ లకు వైస్ చైర్మన్ లకు పదవులు శాశ్వతం కాదు ప్రజల కోసం పనిచేసే మంచి నాయకుడిగా ప్రతి ఒక్కరు పని చేయాలని అయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 30% గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో అవార్డు పొందుకున్న ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు.ప్రజల కోసం పనిచేసిన నాయకులు ప్రజల అభిమానాన్ని మీరు ఎప్పుడు పొందుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో పనిచేసిన చైర్మన్ లను వైస్ చైర్మన్ లను ఆయన పదవీ విరమణ చేసిన వారిని అభినందించారు.తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా అయ్యెంత వరకు మీరు మళ్లీ మున్సిపాలిటీలను చైర్మెన్డ్లుగా కైవసం చేసుకునే వరకు పోరాడాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ను శాలువా కప్పి అయనకు జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి,చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
