*మణుగూరు మండలంలోని రామానుజవరం ఉన్నత పాఠశాల బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులు కోటేశ్వరరావు జాతీయ స్థాయిలో ఘనత వహించారు.*
*మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు నిర్వహించిన జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ పోటీలలో ఆయన సైబర్ అవేర్నెస్ టేల్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు.*
*దేశవ్యాప్తంగా నిర్వహించిన సైబర్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆయన ప్రతిభను చాటుకున్నారు.*
*ఈ అవార్డును ఫిబ్రవరి 2025లో జాతీయ స్థాయి వేదికపై స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రథమ బహుమతి సాధించడం గర్వకారణమని మండల విద్యాశాఖ అధికారి జి. స్వర్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగశ్రీ, ఎం. శ్రీలత, పి. యశోద, మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.*
*కోటేశ్వరరావుకు విద్యారంగ ప్రముఖులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.*