◆ప్రభుత్వం ఇప్పటికి అయినా న్యాయం చెయ్యాలి
◆పినపాక, మారేడు గూడెం పోడు సాగుదారులు
పినపాక.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మారేడుగూడెం గ్రామస్తులు 2006 సవంత్సరం కన్న ముందు నుంచే పొడు భూమి కొట్టుకొని సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నపుడు… 2006 ఆటవి హక్కుల చట్టం ప్రకారం 2008 సం //లో సర్వే చేసి 2009 సం //లో పొడు పట్టాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇచ్చారు. ప్రభుత్వం పొడుపట్టలు ఇచ్చిన గానీ ఫారెస్ట్ ఆధికారుల అరాచకం ఆగ లేదు. పొడుపట్టలు ఉన్నటువంటి గిరిజనుల భూములను బలవంతంగా లాగేసుకొని పట్టాలు ఉన్నాయ్ అనిచెప్పినా విన్నకుండా మా భూములు మాకు ఇవ్వాలని అడిగితె… వారిపై కేసులు పెట్టటం మళ్ళీ అడిగితే అడిగే వారి పిల్లలపై క్రిమినల్ కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.ఇదే తరుణం లో 30/1/2025 కూడా మళ్ళీ కేసుపెట్టారు. గిరిజనులపై ఫారెస్ట్ ఆధికారుల అరాచకాలు, అధికార జులుం ఎప్పటికి అప్పుడు చూపిస్తూనే ఉన్నారు…
అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా.? ఎలా అయినా ప్రవర్తించవచ్చా..?? ప్రభుత్వం ఉద్యోగులు అంటే అంత ప్రత్యేకమా..?? ఆదివాసి బిడ్డల హక్కులను అడిగినా మాకు న్యాయం చెయ్యాలని విన్నమించిన అన్యాయం గా వారిపై ఫారస్ట్ అధికారులు కేసులు పెడుతారా..?? ఇదెక్కడి న్యాయం అని మాకు తగు న్యాయం చెయ్యాలని మా బిడ్డల బతుకుకు ఒక మార్గం చూపించాలని మారేడుగూడెం ఆదివాసులు వారి గోడును విన్నమించుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో సోంబోయిన కృష్ణ, మాడే పొట్టయ్యా, అరేం పగిడయ్య, మాడే చిన్న సోమయ్య, కోరం జయంతి, కోరం మల్లమ్మ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు…