-డి.వై.యఫ్.ఐ క్యాలెండర్ తీయడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.
-డి. వై. యఫ్. ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్.
-జిల్లా వ్యాప్తంగా 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రముఖ వైద్యులు,యాజమాన్యాలు,ప్రముఖులు.
నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి
వైరా:స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలతో,మహనీయుల ఆశయాలతో నిరుద్యోగుల యువత డిమాండ్స్ ప్రతిబింబంగా డి.వై.యఫ్.ఐ క్యాలెండర్ ముద్రించి యువతలో,ప్రజల్లో విసృతంగా ప్రచారం చేయడం జరుగుతుందని,డి.వై.యఫ్.ఐ క్యాలెండర్ ని తీయడానికి సహకరించిన వారందరికీ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ ధన్యవాదాలు తెలిపారు.
డి. వై. యఫ్.ఐ ఖమ్మం జిల్లా 2025 సంవత్సర క్యాలెండర్ ను స్థానిక వైరాలోని మధు, ఠాగూర్, న్యూ లిటిల్ ప్లవర్స్, కార్తీక్ పలు విద్యాలయాల యాజమాన్యాలతో,వైద్యులతో డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్,డి.వై.యఫ్.ఐ నాయకత్వంతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రముఖ వైద్యులు,విద్యాసంస్థల యాజమాన్యాలు, రియల్ ఎస్టేట్ వ్యాపరులు యడ్స్ ఇచ్చిన ప్రముఖుల అందరిచేత ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో దేశ భక్తి భావాలను పెంచేందుకు డి. వై. యఫ్. ఐ రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేస్తుందని,నేటి యువత మూఢత్వా ఆలోచనలకు వ్యతిరేకంగా సైoటిఫిక్ ఆలోచనలతో సమాజాన్ని అధ్యయనం చేయాలని వారు తెలిపారు.యువత సమాజంలో చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సమాజ మార్పుకి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలతో,మహనీయుల ఆశయాలతో నిరుద్యోగుల యువత డిమాండ్స్ ప్రతిబింబంగా డి.వై.యఫ్.ఐ క్యాలెండర్ ముద్రించి యువతలో,ప్రజల్లో విసృతంగా ప్రచారం చేయడం జరుగుతుందని,డి.వై.యఫ్.ఐ క్యాలెండర్ ని తీయడానికి సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో డి.వై.యఫ్.ఐ వైరా పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు చితారు.మురళీ,షేక్.నాగుల్ పాషా,విద్యాసంస్థల యాజమాన్యాలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.