+91 95819 05907

తెలంగాణకు ఒక పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించకపోవడం తీవ్ర అన్యాయం:ఎంపీ వద్దిరాజు కేంద్ర బడ్జెట్ పై స్పందన

◆ఎంపీ వద్దిరాజు కేంద్ర బడ్జెట్ పై స్పందన

నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:

పార్లమెంట్ లో వరుసగా 8వ సారి జాతీయ బడ్జెట్ (కేంద్ర బడ్జెట్)ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కు హృదయపూర్వక అభినందనలు.ఈ ఆర్థిక (2025-26) సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 50 లక్షల 65వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టినా ఇందులో తెలంగాణకు ఒక పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించకపోవడం తీవ్ర అన్యాయం.ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని మరోసారి తీవ్ర నిరాశపర్చింది.అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారు.బీహార్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటును ప్రకటించి, తెలంగాణలోని మామూనూర్ పునరుద్ధరణ, కొత్తగూడెం, ఆదిలాబాద్ లలో విమానాశ్రయాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం తీవ్ర అభ్యంతరకరం.వీటి విషయమై పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడును స్వయంగా కలిసి వినతిపత్రమిచ్చి కోరడం జరిగింది.అయినా కూడా ఈ విమానాశ్రయాల ఏర్పాటు గురించి బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం అన్యాయం.పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్ కు జాతీయ హోదానిచ్చి నిధులు కేటాయించాలనే తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్ ను పెడచెవిన పెట్టడం శోచనీయం.బీఆర్ఎస్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (IIM), మరికొన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లు,సైనిక్ స్కూల్స్,కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నవోదయ పాఠశాలల ఏర్పాటు ప్రస్తావనే లేకపోవడం శోచనీయం.ఈ బడ్జెట్ లో రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిచ్చి మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పించడం సంతోషకరం.నిర్మలమ్మకు తెలంగాణతో సత్సంబంధాలు ఉండి కూడా బడ్జెట్ లో ఈ విధంగా వివక్ష చూపడం తీవ్ర విచారకరం.
-వద్దిరాజు రవిచంద్ర MP (రాజ్యసభ),బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !