రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 1:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ది రాములు తల్లి కాట్రియాల రాజు తల్లి అనారోగ్యంతో మరణించగా ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శనివారం రోజు వారి కుటుంబాన్ని పరామర్శించారు.అదేవిధంగా గ్రామంలో ఉన్న మద్ది గంగాధర్ కుటుంబాన్ని పరామర్శించి వారి పిల్లలకు ఫిక్స్ డిపాజిట్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.అలాగే గ్రామానికి చెందిన వాటర్ మ్యాన్ మద్ధి రాములు కుటుంబాన్ని ఆయన పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటానని అయన తెలియపరచారు.ఆయన వెంట రామాయంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత రావు,రమేష్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మరి రమేష్ చారి,మహేందర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
Post Views: 115