రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టడానికి చెందిన కోనాపురం పోచవ్వ అనే వృద్ధురాలు ఇటీవల మల్లెచెరువులో దూకి మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు రామాయంపేట పట్టణానికి చెందిన పుట్టి సందీప్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.తన వంతు సహాయంగా బాధిత కుటుంబానికి ఆదివారం నాడు పుట్టి సందీప్ 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రజక కులస్థులు పెద్దలు ముతర్గల్ల పోచయ్య, రాములు,మ్యాథరి కిషన్, కోనాపురం మల్లేశం,కోనాపురం స్వామి మరియు వంశీ,తమ్మలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 78