*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, దోపిడి వ్యవస్థను మార్చుటకు ప్రజ కళాకారులు గొంతు విప్పాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎనగంటి చిరంజీవి పిలుపునిచ్చారు. ఈనెల 5వ తారీఖున సూర్యపేట లో జరిగే అరుణోదయ సంస్కృతి సమైక్య విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ మండలం పరిధిలోని కాచనపల్లి గ్రామంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ఎంతో కీలక పాత్ర పోషించారని అన్నారు అలాంటి కళాకారులు నేడు మౌనంగా ఉండి పోవడం సరైనది కాదని అన్నారు. ప్రజలను మేలుకొలిపే విధంగా కళాకారులు తమ నైపుణ్యాన్ని మళ్ళీ ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆట్టికం శేఖర్, లాజర్, సురేష్, అనిల్, తదితరులు పాల్గొన్నారు
Post Views: 50