+91 95819 05907

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని,ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలను 200 రోజులకు పెంచాలని,రోజుకు సగటున 600 రూపాయల వేతనాన్ని అందించాలని,ఉపాధి హమీ కూలీలకు భూమి కలిగిన వ్యవసాయ కూలీలకు ఇచ్చే రైతు భీమా మాదిరిగా ఉపాధి హామీ కూలీకి కూలీ భీమా ప్రవేశపెట్టాలని,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఉపాధి హామీ షరతును ఎత్తివేయాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబాసి సంజీవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం నాడు నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలోని ఫిబ్రవరి 2న జాతీయ 19వ గ్రామీణ ఉపాధి హమీ కూలీల దినోత్సవ ప్రారంభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 740 జిల్లాలలో 7,86,927 గ్రామాలలో 14.55 కోట్ల ఉపాధి హమీ జాబ్ కార్డు కలిగిన కుటుంబాలుంటే పనికి వెళ్ళెవారికి సంఖ్యపరంగా చూసుకుంటే 3లక్షల కొట్లు అవసరముంటే 2024-25 బడ్జేట్ లో కేటాయించిన మాదిరిగానే 2025-26 బడ్జేట్ లో 86 కోట్లు మించి పెంచకపొవటం పట్ల కూలీల పట్ల కేంద్రం సంవత్సరానికింత అన్యాయం చేస్తు సంవత్సరానికి ప్రతి కూలీ కుటుంబానికి 100 రొజుల పనిదినాలకు గాను కేవలం 41 రొజులు మాత్రమే కల్పిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 53.07 లక్షల జాబ్ కార్డులుంటే 110 కోట్ల ఉపాధి కూలీలకు కేంద్రం 9800 కోట్లు అవసరముంటే కేవలం 4,416 కోట్లు మాత్రమే కేటాయించి కూలీలను ఉపాధి హమీ పనుల నుండి దూరం చేస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అత్మీయ భరోసాలో 20 రోజులు పనిచేసిన కుటుంబాలకు మత్రమే భరోసా ఇస్తామనే నిబంధనలను తీసివేయాలని,దీని వలన తక్కువ కుటుంబాలు మత్రమే అర్హత సాదించే అవకాశముందన్నారు.కనుక కూలీలకు ఉపాధి హామీ షరతును ఎత్తివేయాలని,కూలీలకు ప్రస్తూతం అమలుచేస్తున్న రెండు లక్షల ప్రమాద భీమాను 10 లక్షలకు పెంచాలని,ఉపాధి హమీ కూలీకి 600 వేతనాన్ని ఇవ్వాలని,పని కల్పించలేని పరిస్థితిలో కూలీలకు నిరుద్యోగ భృతి చెల్లించాలని,ఉపాధి హమీ కార్డులను తొలగించకుండా ఉపాధి హమీని కూలీలకు హక్కుగా అమలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిద్ధరాములు,సిఐటియు బాలమణి,లక్ష్మాగౌడ్,సిద్ధరాములు,వెంకట్,శ్రీనివాస్ గౌడ్, సిద్దయ్య,జీవన్ గౌడ్,కిష్టయ్య, తలహ,ఇమామ్,జుబేర్,రాజు, పోచమ్మ,జమున,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకుడు పుట్టి సందీప్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టడానికి చెందిన కోనాపురం పోచవ్వ అనే వృద్ధురాలు ఇటీవల మల్లెచెరువులో దూకి మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త

Read More »

తల్లి కొడుకు అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నుండి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందింది.అనుముల బాగవ్వ భర్త నారాయణ వయస్సు (65)

Read More »

స్నానాల లక్ష్మీపురం లో సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు.

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని వ్యవసాయ

Read More »

అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా ఎమ్మెల్యే తనయుడు మాలోత్ విగ్నేష్

నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి జూలూరుపాడు మండలం (బేతాళపాడు) గ్రామంలో పాలెపు సర్వేశ్వరరావు- శ్రావణి కుమార్తె భవ్య అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్

Read More »

 Don't Miss this News !