రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన రాగి రాములు కు బిజెపి ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన కార్యవర్గం లో రాగి రాములు కు రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పదవి ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన బిజెపి ఎన్నికలలో రాగి రాములుకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయ పదవి ఉండగా పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయునిగా పనిచేసిన సమయంలో తపస్ జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు, జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు,రాష్ట్ర కార్యదర్శిగా ఒకసారి,ఉపాధ్యక్షులుగా ఒకసారి, తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో పంచేసా.ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయ పదవి ఉండగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. తనను గుర్తించి బిజెపి పార్టీకి సేవ చేస్తాడని నమ్మి నన్ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు,ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ లకు ఆయన అభినందనలు తెలిపారు.బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినందుకు బిజెపి పార్టీ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు.