రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గోడ పత్రికను ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.అదేవిధంగా రామాయంపేట డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగ మాజీ ఉప కులాలు నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో నుండి ప్రతి కుటుంబంలో నుండి డప్పు సంకకు వేసుకొని ప్రతి కుటుంబం నుండి ఒకరు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాతూరి రాజు,లద్ద నర్సింహులు,మల్యాల కిషన్,బోర్ర అనిల్ కుమార్,ఎర్ర దుర్గం,గంగపురం సంజివులు,ఎర్ర నరేష్,అక్కిరిగారి రాజు,రమేష్,చిప్పకుర్తి సంపత్,ఎర్ర రాములు తదితరులు పాల్గొన్నారు.