రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వసంత పంచమి కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరిగింది.ఈ పుష్కర బ్రహోత్సవాలకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.అదేవిధంగా పట్టణంలోని ప్రజలు భక్తులు అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,అల్లాడి వెంకటేష్,యుగంధర్ రావు,విప్లవ కుమార్,డాకి స్వామి, మహేందర్ రెడ్డి,దేమే యాదగిరి,ఎనిశెట్టి అశోక్ ఆలయ కమిటీ నిర్వాహకులు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.