రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ అశోక్ సింఘాల్ శిశుమందిర్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా శిశుమందిర్ లో పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో మొత్తం 56 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది. అక్షరాభ్యాస కార్యక్రమం అనంతరం నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవం చేశారు.దీంతో పాటు శిశు వాటికకి సంబంధించిన 12 శైక్షణిక వ్యవస్థలను కూడా ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వీరారెడ్డి,పాఠశాల కార్యదర్శి ఏలూరు పండరినాథ్,శిశు మందిర్ పాఠశాల నిర్వాహకులు కృష్ణారెడ్డి,పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Post Views: 30