ములకలపల్లి : నేటిగద్దర్ న్యూస్.మండలం వడ్డెర సంఘం మండల వల్లపు మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వడ్డెర సంఘం రాష్ట్ర కన్వీనర్ రాయల చందర్ రావు, అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షులు బండారి మహేష్ సంయుక్త అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి మాట్లాడుతూ వడ్డెరను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. నేటికి దేశవ్యాప్తంగా 13రాష్ట్రాల్లో వడ్డెరలు ఎస్సీలుగాను, నాలుగు రాష్ట్రాల్లో ఎస్టీలు గాను, ఒక రాష్ట్రంలో డి ఎన్ డి అనే రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు.ఈ సమావేశంలో చల్లా వేంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఈర్ల రామ్మోహన్ రావు, బత్తుల సీతారాములు, వీర్ల గాంధీ, వీర్ల మహేష్,తమ్మిశెట్టి శ్రీనివాస్, వేముల శ్రీను, బత్తుల రాము, బత్తుల అంజి, ఈర్ల శ్రీనివాసరావు, వేముల నాగేశ్వరరావు, ఈర్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.