రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ నార్సింగి మండలం వల్లూరు 44 జాతీయ రహదారిపై గత నెల 30న రాత్రి సమయంలో అడవిలో నుండి చిరుత పులి రోడ్డు అవుతలి వైపునకు దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిందని తెలిపారు.ఈ నేపథ్యంలో జాతీయ రహదారి అధికారులకు తెలపడం ఏమిటంటే అటవీ జంతువుల సంరక్షణ కోసం అండర్ పాసులు నిర్మాణం చేపట్టాలని అయన తెలిపారు.కొన్ని అడవి జంతువులు రాత్రి వేళలో వాటి ఆహారం కోసం మరియు నీటి కోసం రోడ్లు దాటుతున్న క్రమంలో అనేక జంతువులు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ మృతి చెందుతున్నాయని అయన తెలిపారు.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ రహదారి అధికారులు వెంటనే అండర్ పాసులు నిర్మించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని,అటవీ ప్రాంతంలో జంతువుల ఫోటోలతో కూడిన బోర్డులు పెట్టాలని,అదేవిధంగా అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణ కొరకు ఫెన్సింగ్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు.రామాయంపేట రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతంలో వాహనాలు నడిపే ప్రజలు ఏవరైనా జంతువులు రాత్రి వెళ్లలో కనిపించినట్లయితే వాహనాలు నెమ్మదిగా నడిపి వన్యప్రాణులను రక్షించే విధంగా వాటిని కాపాడాలని అయన సూచించారు.