రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 5:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సైకి,రెడ్డి సంఘం నాయకులు మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా రామాయంపేట రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ అనవసరంగా రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న చేయడం సమంజసం కాదన్నారు.ఏ రాజకీయ నాయకులు కూడా రెడ్డిల పైన అగ్రవర్ణ కులాలపై ఇప్పుటి వరకు ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.మీరు ఒక ఉన్నత హోదాలో ఉండి రెడ్డిల ఓట్లు అవసరం లేదని మాట్లాడడం తమకి తగదన్నారు.నీవు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలన్నారు.మాపై ఎన్నోసార్లు నీవు అనుచిత వాక్యాలు చేసినప్పటికీ తాము ఊరుకున్నామని పేర్కొన్నారు.అధికార పార్టీలో ఎమ్మెల్సీగా పదవి చేపట్టి తాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని కించ పరిచే విధంగా విమర్శించడం పద్ధతి కాదన్నారు.వెంటనే తన పదవికి రాజీనామా చేసి రెడ్డిలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
