పినపాక,
పినపాక మండలపరిధిలోని గోపాలరావుపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ అందజేశారు. పాఠశాలలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ దీవెన తన స్వంత ఖర్చులతో 20 మంది విద్యార్థులకు అందించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రమణ గారిచేత విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రమణ విద్యార్థులకు బాటిల్స్ కొనుగోలు చేసిన ఉపాధ్యాయురాలు దీవెనను అభినందించారు. ఈ కార్యక్రమంలో గోపాలరావుపేట,పినపాక,సీతంపేట ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు వినయ్,దేవేందర్, నరసింహారావు, సీఆర్పీ గిరి , పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మి పాల్గొన్నారు.
Post Views: 25