నేటి గదర్ న్యూస్, మణుగూరు:
మణుగూరు మండలంలోని ప్రధాన రహదారి
SBI బ్యాంకు పక్కన గల కట్టు వాగులో ఆవు ప్రమాదవశాత్తు పడినదని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ మణుగూరు పట్టణ మాజీ అధ్యక్షులు లింగంపల్లి రమేష్ స్పందించి వెంటనే ఘటన స్థలానికి చేరుకొని
అగ్నిమాపక సిబ్బంది కి ఫోన్ చెయ్యగా వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అవును రక్షించే పనిలో నిమగ్నం అయ్యారు.
అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేయగా వారు కూడా వెంటనే స్పందించి వారి సిబ్బందిని పంపించడం జరిగింది
ఆవులు రక్షించడంలో సహకరించిన అగ్నిమాపక సిబ్బందికి మరియు మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 377