రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
✍️ది.08.02.2025 ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారి అధ్వర్యంలో నిర్వహించిన నిరసన, దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ అమెరికాలో భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహారిస్తోందని నాగేశ్వరరావు ఆరోపించారు.. వీసాలు లేవన్న కారణంగా అమెరికా నుంచి భారత్ కు తీసుకువచ్చినవారి చేతులకు బేడీలు వేయడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దురహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు..భారత ప్రజల పట్ల అమెరికా అవమానకరంగా ప్రవర్తిస్తే దేశ ప్రధాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు..కేంద్ర వైఫల్యం కారణంగానే 104 మంది భారతీయులను ట్రంప్ ప్రభుత్వం పంపివేసిందని ఆరోపించారు.
