ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బిజెపి మండల అధ్యక్షులు నల్లమోతు రఘుపతిరావు గారి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని విజయోత్సవ సంబరాలను జరుపుకున్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రఘుపతిరావు గారు మాట్లాడుతూ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డమీద భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడిందని ఈ గెలుపుకు కృషిచేసిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.దేశంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వము అవినీతి రహిత పరిపాలన చేస్తూ ప్రపంచంలోనే భారతదేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు నిరంతరము కృషి చేస్తున్నారు. దేశంలోని భారతీయ జనతా పార్టీ పరిపాలన విధానాము నచ్చి ఈరోజు ఢిల్లీ ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని ఇచ్చారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుగులోత్ రాజేష్, మాజీ మండల అధ్యక్షులు భోగి కృష్ణయ్య, కుక్కడుపు రామారావు,మరకాల రవీందర్ రెడ్డి, జంగా సత్యనారాయణ రెడ్డి, గూగులోత్ రాంబాబు నాయక్, చిన్నం సురేష్, విజయ భాస్కర్, తేజావత్ బాబు, వీరపనేని సతీష్, రాయల చందర్రావు, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు
