+91 95819 05907

13 మాసాలు గడిచిన హామీలు మాత్రం అమలుకు నోచుకోలే :మాజీ ఎమ్మెల్యే రేగా

*హామీ పత్రం ఇంటింటికి ఇచ్చారు అమలు మాత్రం ఒకే గ్రామానికి చేస్తారా*
*గుండాల మండల బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేగా కాంతారావు*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 13 మాసాలు గడిచిన ఇప్పటికి పథకాలు అమలుకు నోచుకోలేదని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. శనివారం గుండాల మండలం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప కొత్తగా నియోజకవర్గానికి ఒక్క పైసా మంజూరు చేయలేదని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం చేసిన పథకాల్లో కోత విధించడమే తప్ప కొత్తగా వీరు సాధించింది ఏమీలేదని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు రాష్ట్ర ప్రజలు రానున్న పంచాయితీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడు ఎరుగు కానీ గతంలో అమలు అయిన పథకాలనైనా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో కుంటుపడిందని గాడిన పెట్టాలంటే అది కెసిఆర్ వల్లనే సాధ్యమని అన్నారు. గ్రామ సభల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారే తప్ప వాటితో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. గ్యారంటీ పత్రం ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఇంటికి ఇచ్చారని పథకం అమలు చేయాల్సి వస్తున్నప్పుడు మాత్రం మండలానికి ఒక ఊరుకు అందులో కొంతమందికే అమలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కోసమే బూటకు హామీలు ఇచ్చారు తప్ప అమలు చేయడం కోసం కాదని ఆయన అన్నారు రానున్న ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ ఏ గ్రామంలోనైనా పూర్తిస్థాయిలో అమలు అయిందని నిరూపించే దమ్ము ఉందా అని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించి బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, రైతు సమన్యాసం తి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, ఉపాధ్యక్షులు కటికం నాగేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి టి రాము,ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు,పార్టీ సీనియర్ నాయకులు వట్టం రవి, గడ్డం వీరన్న, గుగ్గిల రాంబాబు, జాడి ప్రభాకర్, పొంబోయిన సుధాకర్, తాటి కృష్ణ, బొమ్మెర శ్రీను, లక్ష్మీనరసు, మల్లయ్య, ముఖ్య శ్రీను, పద్మారావు, మహేందర్, లక్ష్మయ్య, బొమ్మెర్ల సతీష్, బొకే వీరు, సిహెచ్ వీరన్న, వెంకన్న, కాలే, హరి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !