రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 8 :- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించడం పట్ల బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇన్చార్జి నాయకులు పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కనివిని ఎరగని రీతిలో ఢిల్లీ కోటపై కాషాయం జెండా ఎగురవేయడం జరిగిందన్నారు.మా నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ 48 సీట్లతో ఒక ప్రభంజనం సృష్టించిందన్నారు.పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి ద్యేయంగా మధ్యతరగతి ఉద్యోగులే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీకి ఈరోజు ఢిల్లీ ఎన్నికలు గిఫ్ట్ గా భావిస్తున్నామన్నారు.విమర్శకులకు సమాధానం ప్రజలే చెబుతారని అన్నారు.ప్రజాస్వామ్యంలో ఎప్పుడు న్యాయం బ్రతికే ఉంటుందన్నారు.అదేవిధంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు విజయం ఎప్పుడు సాధిస్తుందన్నారు.ఈరోజు ఢిల్లీలో జెండా ఎగురవేయడం జరిగిందన్నారు.రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి వార్డ్ మెంబర్లను గెలిపించి ఎన్నో రోజులుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కండువాలను నమ్ముకొని పార్టీ జెండాను భుజాన మోసి నమ్ముకొని ఉన్న నాయకులకు అండగా తాము నిలుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
