రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 8:- తెలంగాణ బీడి వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెండవ మహాసభలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయం సి ప్రభాకర్ భవన్ లో ఇటీవల జరిగాయి.ఈ మహాసభలలో మెదక్ జిల్లా నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అయ్యవారు లక్ష్మణ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జీడీ బాల లక్ష్మి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లుగా కె పార్వతి, కొమ్మాట స్వామి ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజి రెడ్డి,రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఇన్చార్జి విలాస్,నూతన రాష్ట్ర నాయకత్వానికి మెదక్ జిల్లా తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో అయ్యవారు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులకు నాణ్యమైన తునికాకు 26 గంటలు పని దినాలు బీడీ యాజమాన్యాలు కల్పించాలన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కు రాజీనామా పెట్టిన కార్మికులకు 6 వేల రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలన్నారు.మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని విస్మరించిందన్నారు.రామాయంపేట పట్టణంలో గల బీడీ కార్మికుల దవాఖాన కార్మికులకు సరైన మందులు లేవని పర్మనెంట్ డాక్టర్లను నియమించాలని తెలిపారు.బీడీ కార్మిక దవాఖాన ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తున్నందున స్థలం కేటాయిస్తూ నూతన భవన నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.ఉమ్మడి మెదక్-సిద్దిపేట పీఎఫ్ కార్యాలయాన్ని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి కి తరలించే ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు.మెదక్ జిల్లాలో దాదాపు 25 వేల మంది బీడీ కార్మికులు పరిశ్రమలు పనిచేస్తున్నారన్నారు.దేశంలో వ్యవసాయ రంగం కంటే బీడీ పరిశ్రమ అగ్రగామిలో ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు ఇచ్చిన 4 వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలన్నారు.
