రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 8:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని డిసిహెచ్ఎస్ డాక్టర్ శివదయాల్ శనివారం రోజు ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ బాక్స్ పనిచేస్తున్నాయా లేదా ఎలాంటి సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడం కోసం మెదక్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాను ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు.అదేవిధంగా ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల మరియు ఇన్ పేషెంట్ల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో పేషెంట్లకు సరైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.ఆస్పత్రిలో డాక్టర్లు గైర్హాజర్ కాకుండా విధులు నిర్వహిస్తున్నారా అన్న విషయాలపై ఆయన ఆరా తీశారు.ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు సరిగ్గా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
