+91 95819 05907

వైభవంగా అక్షరాలతోవ వార్షికోత్సవం

కథల, కవితల విజేతలకు పురస్కారాల ప్రదానం
విజేతల రచనల సంపుటి ఆవిష్కరణ
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం, ఫిబ్రవరి 9 ః
ప్రముఖ సాహితీ సంస్థ అక్షరాలతోవ సాహితీ సంస్థ ఏడవ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఖమ్మంలోని జెడ్పీ మీటింగ్‌హాల్‌లో అక్షరాలతోవ నిర్వాహకులు నామా పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సభలో అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన కథల, కవితలతో ప్రచురించిన పుస్తకాన్ని రిటైర్డ్ హెచ్‌ఎం, పరిశ సీతారత్నం ట్రస్ట్ వ్యవస్థాపకులు పరిశ పుల్లయ్య, స్పర్శ సామాజిక అధ్యయన కేంద్రం ఛైర్మన్ స్పర్శ భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం సభలో పరిశ పుల్లయ్య, భాస్కర్ మాట్లాడుతూ సమాజంలో మార్పులను గమనిస్తూ పీడితుల పక్షాన నిలిచే కవిత్వాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ పరిశీలనను పెంపొందించే రచనలు రావాలన్నారు. సామాన్యుల పక్షాన కవిత్వ నిలవాలన్నారు. సమాజహితాన్ని కోరుతూ సాహిత్య సేవ చేస్తున్న అక్షరాల తోవ సాహిత్య సంస్థను అభినందించారు. జెవివి రాష్ట్ర నాయకులు అలవాల నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్‌ను బలపరుస్తూ కవిత్వం రావాలన్నారు. ప్రశ్నించే తత్వాన్ని బలపరచాలన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు సైదులు ఐనాల మాట్లాడుతూ నేర్చుకోవడం, నేర్పడం కవులు చేయాలన్నారు. కవులను ప్రోత్సహిస్తూ ఏడేళ్లుగా అక్షరాల తోవ చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రముఖ రచయిత్రి వురిమళ్ల సునంద, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తాళ్లూరి లక్ష్మీ, ప్రముఖ రచయిత, గాయకుడు యోచన మాట్లాడుతూ అక్షరాలతోవ సాహిత్య సేవను విశ్లేషిస్తూ అభినందించారు. ప్రముఖ సినీ దర్శకులు కొత్తపల్లి శేషు తన ప్రసంగంతో సభను అలరించారు. తెలుగు భాషా గొప్పతనం, అక్షరాల తోవ సాహిత్య సేవను కొనియాడుతూ వినిపించిన కవిత అందరినీ ఆకట్టుకుంది. విజేతల కథల, కవితలతో రూపొందిన పుస్తకాన్ని రాచమళ్ల ఉపేందర్ పరిచయం చేశారు. ఈ సందర్బంగా అక్షరాల తోవ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త అన్నం శ్రీనివాసరావును సన్మానించారు.రెండు తెలుగు రాష్ట్రాల లోనుండి వచ్చిన కథ కవిత విజేతలు స్పందన సభికులను ఆకట్టుకుంది.. అనంతరం కథల, కవితల విజేతలకు పురస్కారం అందచేశారు. ప్రముఖ గాయకులు పాగి వెంకన్న, సత్యానందం, రేళ్ల శ్రీనివాస్, పొట్టేటి వెంకట్రామయ్య, సీత్లానాయక్ గీతాలు అందిరనీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అక్షరాలతోవ నిర్వాహకులు దాసరోజు శ్రీనివాస్, ప్రముఖ కవులు సయ్యద్ షఫీ, కన్నెగంటి వెంకటయ్య, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, కంచర్ల శ్రీనివాస్, ఇబ్రహీం నిర్గుణ్, పెద్దోజు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !