+91 95819 05907

ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ..’ తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

భారత రాజ్యాంగం ప్ర‌సాదించిన హక్కుల‌ను, గ్యారంటీలను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ గారు ఆకాంక్షించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ‘ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ..’ తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రఖ్యాత మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక #Mathrubhumi వారు తిరువ‌నంత‌పురంలో ఏర్పాటు చేసిన “మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌” స‌ద‌స్సు (#MBIFL2025)లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని, ప్ర‌సంగించారు. అలాగే, మాతృభూమి ఎడిట‌ర్ మ‌నోజ్ కె.దాస్‌ గారు, కొందరు సభికులు ముఖాముఖి అడిగిన ప్ర‌శ్న‌ల‌కూ ముఖ్య‌మంత్రి గారు స‌మాధానాలిచ్చారు.

🔹 “దశాబ్దాలపాటు కుటుంబ నియంత్ర‌ణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేప‌ట్టి ద‌క్షిణాదిని శిక్షిస్తున్నారా?

🔹 ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాష్ట్రాన్ని నిలబెట్టేలా తెలంగాణ రైజింగ్ నినాదంతో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి కార్యాచరణ తీసుకున్నాం. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను ఇప్పటికే అమలు చేస్తున్నాం.

🔹 అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారుతోంది. ఇటీవల దావోస్ ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో రాష్ట్రానికి రూ.1.82 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి.

🔹 పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు అన్ని వర్గాలకు సంక్షేమాన్నీ సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రైతుల‌కు 24 గంట‌లు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా, ఎక‌రాకు రూ.12 వేలు రైతు భ‌రోసా, భూమి లేని కుటుంబాల‌కు ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌తో పాటు క్వింటాకు రూ.500 బోన‌స్ ఇస్తున్నాం.

🔹 దేశంలోనే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌. 25 లక్ష‌ల రైతు కుటుంబాల‌కు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం.

🔹 సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం. స‌మ‌గ్ర కుల స‌ర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ‌. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను అమలుకు పూనుకున్న తొలి రాష్ట్రం కూడా తెలంగాణే. ఈ అంశాలను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన ఫిబ్ర‌వ‌రి 4వ తేదీని ఏటా ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్స‌వం’గా జ‌రుపుకుంటాం. జ‌నాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వ‌న‌రులు స‌మ‌కూర్చుతాం.

🔹 సుప‌రిపాల‌న ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుంద‌నేందుకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఒక ఉదాహార‌ణ‌. కేంద్ర ప్ర‌భుత్వ తాజా ఆర్థిక స‌ర్వే నివేదిక ప్ర‌కారం అతి త‌క్కువ ద్ర‌వ్యోల్బ‌ణం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌. త‌ల‌స‌రి ఆదాయంలోనూ ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నాం.

🔹 తెలంగాణ ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఆర్థిక వ్య‌వ‌స్థ అయితే అది భార‌త‌దేశ వృద్ధికి ప్ర‌యోజ‌నం కాదా? మరి కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలకు అండగా ఎందుకు ఉండటం లేదు? ప్ర‌త్యేకించి ద‌క్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల‌కు కేంద్రం ఎందుకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదు?” అని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !