★మద్దతు ధర లేదని కన్నీరు పెట్టిన రైతన్న
నేటి గదర్ న్యూస్ ప్రతినిధి: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కు గిట్టుబాటు ధర దక్కక పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో మిర్చి తోటలు వేశారు.కాపు కూడా బాగానే వచ్చినట్లు సమాచారం. కానీ మిర్చి ధర మాత్రం తగ్గినట్లు రైతులు ఆవేదన వెలుబుచ్చుతున్నారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరం గ్రామంలో అప్పులు చేసి పంట పెడితే, మిర్చి క్వింటాలు రూ.3000కు కొంటున్నారని కంటతడి పెట్టిన రైతు.ప్రభుత్వం మిర్చి పంట కు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 161









