★కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో* విఫలమయ్యాయి:అన్నవరపు
బిజెపి పాలన కాలంలో మహిళలపై పెరిగిన దాడులు…*
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఎం జ్యోతి …
మణుగూరు: కేంద్రంలో బిజెపి పాలనను పాతరేయడమే కామ్రేడ్ కుంజ కృష్ణకుమారికి నిజమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు ఆదివారం పగిడేరులో కుంజ కృష్ణకుమారి ప్రధమ వర్ధంతి సభ మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగినది ఈ సందర్భంగా అన్నవరం కనకయ్య సిపిఎం జెండాను ఆవిష్కరించి కృంజా కృష్ణకుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి లౌకిక రాజ్యాంగాన్ని నివారించేందుకు కుట్ర పండుతున్నదన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఉపాధి హామీ కూలీలకు 85 లక్షల కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేసింది అన్నారు ప్రస్తుత పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రెండు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు వందరోజుల పని దినాలు కూడా 45కు తగ్గాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చేశారు దేశ ప్రజలు సరుకుల కొనుగోలుపై పెట్టే ఖర్చు గాని పొదుపుగా ని తగ్గిపోయాయి అని అన్నారు ఈ పరిస్థితి మారాలంటే కేంద్ర ప్రభుత్వం పై ప్రజా పోరాటాలు నిర్వహించాలన్నారు మతం ముసుగులో కులాల మధ్య మతాల మధ్య విభజన కార్చిచ్చు లేపుతుందన్నారు దీని కారణంగా మణిపూర్ బలైంది అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు భూములు లేని ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు పగిడేరు లో కుంజ కృష్ణకుమారి ఆశయాలను కొనసాగించాలంటే సిపిఎం పార్టీని ఆదరించి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించాలని కోరారు అనంతరం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జ్యోతి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు దాని స్థానంలో మనుధర్మాన్ని అమలుచేసి సనాతన ధర్మం పేరుతో మహిళలపై దాడులు చేస్తుందన్నారు కామ్రేడ్ కృష్ణకుమారి ధైర్యవంతురాలని చెప్పారు జిల్లా కమిటీలలో అనేక సందర్భాలలో తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కృష్ణకుమారి ఆశయాలు కొనసాగాలంటే ఎర్రజెండా రెపరెపలు ఆడాలని అన్నారు కృష్ణకుమారి అడుగుజాడల్లో ఈ ప్రాంతాల్లో మహిళలు ముందుకు రావాలని, కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యతిరేక చట్టాలను అమలు చేయకుండా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు అనంతరం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ కృష్ణకుమారి జీవన ప్రస్థానం ఆమె కొనసాగించిన ధైర్య సాహసాలు వారి కుటుంబం ఈ ప్రాంతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు సామాజిక కార్యకర్త కర్నే రవి ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గువ్వ రాంబాబు కృష్ణ కుమారి పోరాట పటిమ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల వెంకన్న మడి నరసింహారావు పిట్టల నాగమణి బొల్లం రాజు మండల కమిటీ సభ్యులు కుంజా రాజు పల్లపు నాగేశ్వరరావు పసునూరు సంజీవరెడ్డి ములకల ఉత్తం కోండ్రు గౌరీ అమాలి శాఖ కార్యదర్శి ఆర్ శీను, నాయకులు సాంబయ్య సాంబాయిగూడెం శాఖ కార్యదర్శి టేకుల సత్యవతి ఐద్వా మండల అధ్యక్షురాలు దొడ్డి నిర్మల భీమయ్య శాంతినగర్ శాఖ కార్యదర్శి రెంటాల నరసయ్య పగిడేర్ శాఖ కార్యదర్శి కుంజ నరసింహారావు కుటుంబ సభ్యులు భర్త కుంజ బాబురావు కుమారుడు కుంజరాజా మరియు అధిక సంఖ్యలో పార్టీ సభ్యులు ప్రజాసంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొని కుంజా కృష్ణ కుమార్ కి పూలతో నివాళులర్పించారు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు .