🔷 ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు
🔹రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లలో కన్నీళ్లే కనిపిస్తున్నాయి
🔹ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు
🔹ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన్రు
🔹రాహుల్ గాంధీని తీసుకు వచ్చి హామిలిప్పించారు
🔹సోనియా గాంధీతో లెటర్లు రాయించారు. హామీలన్నీ ఏమయ్యాయి
🔹11 సార్లు ఢిల్లీ పోయినా రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి
🔹పోతున్నడు వస్తున్నడు కానీ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ రేవంత్‌కు లేదు
🔹రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స్పందించి ఆర్ఎంపీ, పీఎంపీలకు సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం
🔹బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాడులు లేవు, కేసులు లేవు
🔹కాంగ్రెస్ హయాంలో ఏ రాత్రి ఎవరు వస్తరో, ఎట్ల అరెస్టులు చేస్తరో తెలయని పరిస్థితి
🔹ఆర్ఎంపీలను పోలీసులను పెట్టి వేధిస్తున్నారు
🔹ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు
🔹కేసులు పెట్టి బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు
🔹ఆర్ఎంపీలను రోడ్ల మీదకు తెచ్చారు
🔹రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి తక్షణం స్పందించి ఆర్ఎంపీలపై కేసులు పెట్టకుండా చూడాలని, ఎన్నికల హామీలో చెప్పినట్లు ట్రైనింగ్ ఇప్పించాలని, సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం
🔹బీఆర్ఎస్ హయాంలో మీకు శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తే, కొందరు స్టేలు తెచ్చారు
🔹నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే, స్టేలు తెచ్చారు
🔹స్టేలు తెచ్చినా మేం మీ బతుకు దెరువు ఎక్కడా ఆపలేదు
🔹మీ మీద కేసులు పెట్టలేదు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పలేదు
🔹కాంగ్రెస్ వాళ్లు వచ్చినంక అందరి బతుకులు రోడ్డున పడ్డయి
🔹గీత కార్మికుల పొట్ట కొడుతున్నరు. అక్రమ కేసులు పెడుతున్నరు
🔹రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, చివరకు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు
🔹మొదటి హమీ మహాలక్ష్మి, చివరి హామీ పింఛన్లు దిక్కు లేదు
🔹రైతు రుణమాఫీ మీద ఏ ఊర్లకైనా పోదాం చర్చిద్దాం
🔹ఇవ్వాల్సింది రూ. 45 వేల కోట్లు, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెబుతున్నది 21, ఇచ్చింది 15, 16 వేల కోట్లు
🔹రుణమాఫీ ఓ మోసం.. ఆ 15,16 వేల కోట్లు ఎట్ల ఇచ్చిండంటే.. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి 8 వేల కోట్లు, రుణమాఫీకి ఇచ్చిండు
🔹రెండు నెలల పింఛన్ 2 వేల కోట్లు ఎగ్గొట్టి, రుణమాఫీకి ఇచ్చిండు
🔹కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ, రంజాన్, క్రిస్టమస్ చీరెలు వెయ్యి కోట్లు ఎగ్గొట్టి, రుణమాఫీకి మలిపిండు
🔹కేసీఆర్ ఇచ్చే న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు బంద్ పెట్టిండు. అందులో రెండు వేల కోట్లు
🔹పిల్లల ఫీజు రియింబర్స్‌మెంట్ కూడా ఎగ్గొట్టిండు. 2500 కోట్లు రుణమాపీల కలిపిండు
🔹ఇట్ల కోతలు కోసిండు రుణమాఫీలో కలిపిండు
🔹ఇచ్చింది ఏముంది. చేసిన హామీలు ఏమయ్యాయి
🔹ప్రజలు ఎవరు వచ్చినా ప్రతి రోజు సీఎం కలుస్తడు అంటడు
🔹15 నెలలు అయినా ఎవర్నీ కల్వలేదు
🔹కొడంగల్ వాళ్లను కూడా రానివ్వని పరిస్థితి
🔹మీ సత్తా చూపే సమయం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
🔹కలసి ఉండాలి. విడిపోయి ఉండొద్దు. అప్పుడే మీకు బలం ఉంటది
🔹కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కంకణం కట్టుకోవాలి
🔹రేవంత్ రెడ్డి గాల్లో ఉన్నడు. గాలి మోటర్లు, విమానాల్లో తిరుగుతున్నడు
🔹ప్రజాస్వామ్యంలో ఓటే బలం. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి
🔹ఇప్పటికే అరెస్టు చేసిన వారి మీద వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
🔹ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటది
🔹ఓట్లప్పుడు మాటలు చెప్పిండు. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నడు
🔹అడిగితే ఉల్టా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నడు
🔹వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి, ప్రశ్నిస్తా నిలదీస్తా
🔹పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప
🔹30% గవర్నమెంట్ అని ఎమ్మెల్యేలే చెబుతున్నరు.. ఏ పని కావాలన్నా 30 శాతం కమీషన్
🔹పోలీసు వాళ్లకు జీతాలు రావడం లేదు, ఆరోగ్య భద్రత పని చేస్తలేదు
🔹పోలీసులు, ఆటో డ్రైవర్లు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నది
🔹ఉద్యోగస్థులకు డీఏలు పెండింగ్, రిటైర్మెంట్ అయిన వారికి బెన్ఫిట్స్ ఇవ్వడం లేదు
🔹మాటల గారడీ, అంకెల గారడీ అని అందరికి అర్థం అయ్యింది
🔹ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదామని చూస్తున్నరు
🔹రేవంత్ రెడ్డి ఢిల్లీకి పొయ్యి ప్రచారం చేసిండు. 80 స్థానాల్లో 77కి డిపాజిట్లు గల్లంతు
🔹ఇక్కడ పని చేసి వేరే రాష్ట్రాల్లో వెళ్లి ప్రచారం చేసుకో
🔹తెలంగాణలో ఏ ఊళ్లకు పోయినా నీ పాలన గురించి చెబుతారు రేవంత్ రెడ్డి









