నేటి గద్దర్ న్యూస్, గుండాల: అనారోగ్యంతో పాత్రికేయుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రాచకొండ సంతోష్ గత కొన్ని సంవత్సరాల నుండి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉండటంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. విలేఖరి సంతోష్ మృతి పట్ల గుండాల ప్రెస్ క్లబ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సంతోష్ కి ఘన నివాళి అర్పించింది. విలేఖరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.
Post Views: 365