హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 11.
మెదక్ జిల్లా సాయి దీప్ రమేష్ మృతి చెందిన విషయం నాయకులు ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి మంగళవారం నాడు వారి నివాసానికి చేరుకొని రమేష్ గారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రమేష్ అంచలంచెలుగా ఎదుగుతూ , మానవత్వానికి మారుపేరు గా నిలిచారన్నారు, తన చిరునవ్వుతో ఎంతోమందిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి భగవంతుని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.వీరి వెంట మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,తాజా మాజీ జడ్పీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్. మామిళ్ళ ఆంజనేయులు, తాజా మాజీ కౌన్సిలర్ ఆర్కే. శ్రీనివాస్, మాజీ రైతుబంధు అధ్యక్షులు సోములు, నాయకులు లింగ రెడ్డి, శంకర్, దత్తు తదితరులు ఉన్నారు.