★సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయాలని *చర్ల బస్టాండ్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ధర్నా* నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ను ఉద్దేశించి
*సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు పాల్గొని మాట్లాడుతూ* ఏమాయే రేవంత్ రెడ్డి ఎటుపాయే నీ ఆరు గ్యారంటీలు ప్రజలను మోసపూచ్చడంలో కెసిఆర్ ను తలదన్నావు.ఇందిరమ్మ ఇండ్లు ఎటుపాయే, రేషన్ కార్డులు ఏడబాయే, పోడు భూముల పట్టాలు ఊసే లేదు, ఆదివాసీలపై నువ్వు చూపించే ప్రేమ ఇదేనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పాతర పెట్టావు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు గొడుగు పట్టావు .సామాన్య ప్రజల నడుము విరిచావు అధికారంలోకి వచ్చే ముందు రైతన్నలపై ప్రేమ వలస పోశావు ఇప్పుడు రైతు భరోసా ఏది రైతు భరోసాని ఉక్కు పాత్ర వేశావు ఇదేనా నీ అతి తెలివితేటలు ప్రజలను మోసపుచ్చుదాం అనుకుంటే ఉద్యమాలతో బుద్ధి చెబుతాం వెర్రి బాగుల ఆలోచనలు మానేయండి ప్రజా అభివృద్ధి గురించి ఆలోచించండని ఆయన అన్నారు. చర్ల మండలంలో రహదారుల రోడ్ల సమస్య ఇందిరమ్మ ఇండ్ల సమస్య విద్యా,వైద్యం సమస్యలను పరిష్కరించే వైపు అధికార యంత్రాంగాన్ని కదిలించండి.రేవంత్ రెడ్డి ప్రజల అభివృద్ధి కోసం నిధులు కేటాయించండని ఫిబ్రవరి 20వ తారీఖున 6 గ్యారంటీ అమలుకై చర్ల మండల ప్రజలు కదిలి రావాలని మధు పిలుపునిచ్చారు. వృద్ధులు,వితంతువులు,వికలాంగుల పెన్షన్లకు 4 వేల రూపాయలు తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని రైతన్నలు పండించిన మిర్చి పంటకు ఎకరానికి గిట్టుబాటు ధర 25 వేల రూపాయలు ప్రభుత్వం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మహిళలకు 500 గ్యాస్ పథకం అమలు చేయాలని ఆరోగ్యశ్రీ ఇవ్వాలని ఆదివాసుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,ఆదివాసీల రెండో పంటైన తునికాకు 50 ఆకుల కట్టకు ఆరు రూపాయల రేటు పెంచాలని,లేనియెడల రైతన్నల ముళ్ళు కర్ర తిరగబడుతుందని చంద్ర కోలలు మరలబడతాయని రైతన్నల తరఫున కారెడ్లు రంకె లేస్తాయని ఇప్పటికైనా రైతన్నల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్,పి ఓ డబ్ల్యు మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇరుప సమ్మక్క,డివిజన్ కమిటీ సభ్యురాలు సూర్యకాంతం అరుణోదయ జిల్లా నాయకులు కొండలరావు పిడిఎస్యు మండల నాయకుడు ఇరుప రాజేష్ తదితరులు పాల్గొన్నారు









