రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సిద్దిపేట ప్రధాన రహదారి మల్లె చెరువు కట్ట వద్ద విద్యుత్ అధికారులు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు.ఈ ట్రాన్స్ ఫార్మర్ కింద గృహాలకు మరియు వ్యవసాయదారులకు విద్యుత్ సరఫరా జరుగుతోంది.ఈ ట్రాన్స్ ఫార్మర్ రోడ్డు పక్కన ఉన్నది.అదేవిధంగా ట్రాన్స్ ఫార్మర్ పక్కన రిక్వెస్ట్ బస్టాప్ కూడ ఉన్నది.సామాన్య ప్రజలు అనుదినం ప్రయాణికులు అక్కడ నుండి బస్సులలో ప్రయాణిస్తుంటారు.అలాగే ఉదయం సాయంత్రం వేళలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బస్సులు దిగడం ఎక్కడం అక్కడ జరుగుతుంది.అక్కడ ట్రాన్స్ ఫార్మర్ కు విద్యుత్ ఫ్యూస్ లు క్రిందకి ఉండడంతో ఎలాంటి రక్షణ లేకుండా పోయింది.దాంతో ఇటు ప్రజలకు అటు పాఠశాల విద్యార్థులకు రైతులకు ఎవరైనా చూడకుండా రాత్రి వేళలో ఫ్యూజ్ లకు తగిలితే చనిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలుపుతున్నారు.ఈ విషయమై పలుమార్లు విద్యుత్ అధికారులకు తెలిపినప్పటికీ అసలు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ ఫార్మర్ కు ఫ్యూజ్ లు కనబడకుండా నూతనంగా ప్యానల్ డబ్బా ఏర్పాటు చేసి చుట్టు కంచేను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
