నేటి గదర్ న్యూస్ ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా పరిషత్ , మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల 2 వ సాధారణ ఎన్నికల నిర్వహణ కొరకు R.O మరియు ARO లకు బుధవారం 12.02.2025 నాడు ఉదయం 10 గం.కు IDOC పాల్వంచ సమావేశ మందిరములో నిర్వహించిన శిక్షణా తరగతులను జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ ) డి.వేణుగోపాల్ ప్రారంభించారు. జిల్లా ఎన్నికల శిక్షణా తరగతుల నోడల్ అధికారి బి. శ్రీరామ్ పర్యవేక్షణ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపముఖ్య కార్య నిర్వహణ అధికారి కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా స్వీకరించి రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల నిర్వహణ మార్గదర్శకాలను తు. చ తప్పకుండా పాటిస్తూ ఎటువంటి వర్గ విభేదాలకు, పక్షపాత ధోరణికి తావివ్వకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను విజయవంతముగా పూర్తిచేయాలని సూచించారు. శిక్షణ లో పాల్గొన్న 208 మంది
ఆర్. ఓ మరియు ఎ.ఆర్.ఓ లకు హైదరాబాద్ లో శిక్షణ పొందివచ్చిన 10 మంది మాస్టర్ ట్రైనీస్ అంశాల వారీగా ఎన్నికల విధివిధానాలను, మార్గదర్శకాలను వివరించారు..