నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కారును వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొని గాయపడగా మానవత్వంతో ఓ విలేఖరి హాస్పిటల్ కి తరలించిన సంఘటన గురువారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సారపాక బ్రిడ్జి సమీపంలో కారును వెనుక నుండి ఓ ద్విచక్ర వాహన దారుడు ఢీకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న బూర్గంపాడు మండలానికి చెందిన విలేకరి బొబ్బురాయుడు మానవత్వంతో 108
అంబులెన్స్ సహాయం తో భద్రాచలం ఆసుపత్రికి సకాలంలో తరలించి మానవత్వం చాటుకున్నారు. తక్షణమే స్పందించిన విలేకరి బబ్బు రాయుడిని పలువురు అభినందించారు. క్షతగాత్రుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 203









