ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సిపిఐలో చేరాలని ఇందుకు రాష్ట్ర కౌన్సిల్ బహిరంగంగా సాధార ఆహ్వానం పలుకుతోందని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో ప్రారంమైయ్యాయి.సిపిఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఎస్.బాల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగాసిపిఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, సిపిఐ సెంట్రల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావులు హజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ తన బలమేమిటో నిరూపించుకోవడమే కాకుండా తమతో పొత్తు లేకపోతే ఏమి జరుగుతో పార్టీలకు ఒక జలకు పుట్టించామని పేర్కొన్నారు. సిపిఐ ఎవరితో పొత్తు పెట్టుకున్నఆ ధర్మాన్ని తు.చ. తప్పకుండ పాటిస్తుందని, కాని ఇతర పార్టీలు మాత్రం పాటించడం లేదని కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మానికి విఘాతం కల్గించిందన్నారు. రానున్న ఎన్నికల్లో పోత్తులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆయనతోనే స్వయంగా తేల్చుకుంటామని కూనంనేని స్పష్టం చేశారు.తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ప్రయోజనాలు పొందాయి తప్పితే వారితో తమకు ఒరగబెట్టింది ఏమిలేదన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్‌తో ఇక మీదట పొత్తు ఉన్నా, లేకపోయినా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయనున్నట్లు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
విదేశీ దౌత్య విధానంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం ః రామకృష్ణ
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్ విదేశీ దౌత్యవిధానంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో నరేంద్ర మోదీ ఓ అసమర్థ ప్రధాని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్ల పాలనలో మోదీ సాధించింది ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా తప్ప ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మౌళికమైన ఒక్క హామీ కూడ నేరవేర్చలేదని పేర్కొన్నారు. అందిన కాడికి దండు కోవడానికి కార్పోరేట్ రంగాన్ని పెంచి పోయించడం,ఇందుకు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మతతత్వ రాజకీయాలకు ప్పాలడడమే వారి స్పష్టమైన ఏజెండా అన్ని అన్నారు. వీటిని ప్రతిఘంటించడంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు వైఫల్యం చెందడంతో వారు ఆడిది ఆట పాడిది పాటగా సాగుతోందని తెలిపారు. బిజెపిని నిలువరించేందుకు కమ్యూనిస్టుగా ప్రజా క్షేత్రంలో బలమైన పోరాటాలను నిర్వహించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇటీవల జరిగినస్థానిక సంస్థ ఎన్నికల్లో సిపిఐ రాష్ట్ర సమితి సాధించిన విజయం తిరిగి దేశ కమ్యూనిస్టు శ్రేణులకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దీంతో స్ఫూర్తితో త్వరలో జరగనున్న 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారని తెలిపారు.
అయుధునిక యుగం నరరూప రక్షసుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ః
సామ్రాజ్యవాద అమెరికా బరితెగించి మరీ ఇతర దేశాలపై యుద్దానికి పాల్పడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. నేటి అయుధునిక యుగం నరరూప రక్షసుడిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారిస్తున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అమెరికాను తిరిగి శక్తివంతమైన దేశంగా చేయలన్నదే లక్ష్యంగా తలపెట్టిన యుద్ద కాంక్షతో పరోక్షంగా 30 దేశాలకు పైగా ప్రభావితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ యుద్దం కారణంగా 85 శాతం ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న మనదేశం ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు గాని, ఈ యుద్దానికి గాని వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకపోవడం ఈ దేశ ప్రజలకు అవమానకరమన్నారు.ఈ సమావేశంలో సిపిఐ జాతీయ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకరెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ,రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కిళ్లపల్లి శ్రీనివాస రావు, ఈటి నరసింహా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, బాల నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
పలువురికి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సంతాపం ః
ఇటీవల మరణించిన సిపిఐ నాయకులకు, ప్రముఖలకు సిపిఐ రా్రష్ట్ర కౌన్సిల్ సంతాపాన్ని తెలిపింది.సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ల పల్లి శ్రీనివాసరావు సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టాగా కౌన్సిల్ రెండు నిమిషాలు పాటు మౌనం పాటించి నివాళ్లు అర్పించింది.ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు నల్లకన్ను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు సిపిఐ నల్లమల్ల గిరి ప్రసాద్ సతీమణి నల్లమల్ల కమలాదేవి, కర్నాటకకు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకులు ఎస్.వి.ఆనంద్ కుమార్, నేత్ర వైద్యురాలు డాక్టర్ సరస్వతి, విశాఖ పట్నం చెందిన అభ్యదయ రచయిత సంఘం మార్కిస్టు నేత చందు సుబ్బారావు తదితరులకు రాష్ట్ర కౌన్సిల్ నివాళ్లు అర్పించింది.








