హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 01.
మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం రోజున మెదక్ ఐబి లో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సమావేశం సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఎస్సీ వర్గీకరణ చట్టంలో అన్ని కులాలకు రిజర్వేషన్ల కేటాయింపులు శాస్త్రీయంగా జరిగేలా చూడాలని ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ,మెదక్ జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు అస్తారుగళ్ల బాలరాజ్ మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి మలిశెట్టి రవి మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్పుల పరమేష్ మాదిగ డిమాండ్ చేశారు. మెదక్ గెస్ట్ హౌస్ లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాజు-( యంఎస్ఎప్) మెదక్ జిల్లా అధ్యక్షులు నాయకులు ఏలూరి సంపత్ కుమార్
మెదక్ మండల చెవిటి గట్టయ్య అధ్యక్షులు ఉపాధ్యక్షులు అనసరం యాదగిరి తుడుము నరసింహులు
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మీద నియమితులైన జస్టీస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ సమర్పించిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని అన్నారు.వివిధ కులాలను గ్రూప్ లలో చేర్చే అంశంలో మరియు వివిధ గ్రూప్ లకు రిజర్వేషన్లు కేటాయించే విషయంలో నిర్దిష్టమైన ప్రామాణిక సూత్రాలను పాటించలేదని అన్నారు.అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ఈ ఎస్సీ వర్గీకరణ మీద ఎస్సీలలో ఉన్న ఏ కులం కూడా ఎన్నో అనుమానాలే తప్ప సంతృప్తిగా లేదని అన్నారు. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సాదాసీదా గా గుర్తించాలని అన్నారు.గ్రూప్ – 1 లో ఉన్న మన్నె ,పంబాల కులాలను గ్రూప్ – 3 లో చేర్చాలని డిమాండ్ చేశారు.గ్రూప్ – 2 లో ఉన్న మాదిగలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు కేటాయించడంలో కమిషన్ వివక్షతను చూపెట్టిందని అన్నారు.అత్యధిక జనాభా కలిగి ఉన్న మాదిగలకు 9% రిజర్వేషన్లు కేటాయించడం అన్యాయమని అన్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే 12% రావాలని లేదా కమిషన్ నియమ నిబంధనలు పాటించినా 11% రిజర్వేషన్ వస్తాయని అన్నారు.కానీ మాల కులానికి లాభం చేకూర్చడం కోసమే కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయతను ,హేతుబద్ధతను రాజ్యాంగ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ పాటించలేదని అన్నారు.ఇప్పటికైనా ఈ లోపాలను, పొరపాట్లను సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఎస్సీ అనగారి కులాలకు న్యాయం జరిగేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాదిగ ఉపకులాల పక్షాన తగిన చొరవ తీసుకోవాలని కోరారు ఎస్సీ వర్గీకరణను వెంటనే సక్రమంగా చేపట్టాలని జరిగినటువంటి కుట్రపూరితమైన లోపాలను పునసమీక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్ ఉద్యమ ప్రయాణంలో ముందుకు సాగుదామని అన్నారు.అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఆనాడు ప్రాణాలు అర్పించిన మాదిగ అమర వీరుల కు ఈరోజు నివాళులర్పించడం బాధాకరమన్నారు జరగబోయే ఉద్యమ కార్యచరణలో ఏ బి సి డి ల సాధనలో భాగస్వామ్యం కొరకు మాదిగ విద్యార్థులు తమ హక్కులు సాధించుకోవడానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంజీవులు మాదిగ,సురేష్ దేవేందర్ రంజిత్ యాదగిరి రమేష్ వెంకటేష్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









