రైతు మొక్కజొన్న పంట చేనులో క్షుద్ర పూజల కలకలం.
నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి.
కొణిజర్ల :ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఉప్పల చిలక గ్రామం సమీపంలోని రైతు మొక్కజొన్న పంట చేనులో క్షుద్ర పూజల కలకలం రేపింది.
దీంతో స్థానిక రైతులు భయబ్రాంతులకు గురయ్యారు
అమావాస్య రోజు
అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పంట చేనులో క్షుద్ర పూజలు నిర్వహించటంతో స్థానిక రైతు బాదావత్ సైదులు నాయక్ భయభ్రాంతులకు గురయ్యామని తెలిపారు. పంట చేను పక్కన ఉన్న రైతులు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతు సైదులు నాయక్ మాట్లాడుతూ తనపై వ్యక్తిగత కక్షలతోనే తన చేనులో క్షుద్ర పూజలు నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంఘట పై విచారణ చేపట్టాలని స్థానిక రైతు
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
Post Views: 169