+91 95819 05907

నిధులుమంజూరు అంటూ ప్రచారం…. ఖమ్మం రైల్వే కాలనీలో అభివృద్ధి ఎక్కడ?

రైల్వే కాలనీలో అధ్వానంగా రోడ్లు

ఖమ్మం నగరంలో పేరుకు నెంబర్ వన్ కార్పొరేషన్…అభివృద్ధిలో మాత్రం శూన్యం..కైకొండాయిగూడెం ఒకటో డివిజన్ రైల్వే కాలనీలో అధ్వానంగా రోడ్లు..నిధులుమంజూర్ అంటూ ప్రచారం…పనులు ప్రారంభించని పరిస్థితి..రోడ్లు అధ్వానంతో పాటు…సైడ్ డ్రైన్లు లేక మురుగు నీటిలో దోమల బెడద..తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రజా ప్రతినిధులకు కాలనీవాసులు విజ్ఞప్తి.

ఖమ్మం మహానగరంలోని పేరుకు నెంబర్ వన్ కార్పొరేషన్ గా ఉన్న కైకొండాయిగూడెం ఒకటో డివిజన్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా నెలకొన్నది.పేరుకు నెంబర్ వన్ కార్పొరేషన్ తప్ప అభివృద్ధిలో మాత్రం శూన్యం అని ఆ ప్రాంతవాసులు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.కైకొండాయిగూడెం ఒకటో డివిజన్లోని ప్రధానంగా రైల్వే కాలనీలో అనేక రోడ్లు నిర్మాణం లేక అద్వానంగా రోడ్లు ఉండటంతో పాటు సైడ్ డ్రయిన్లు లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రధానంగా గుంతలుగుంతలుగా ఉన్న రోడ్లతోపాటు సైడ్ ట్రైన్లో లేక మురుగునీరు చేరి ఇండ్లలో నుంచి వచ్చినటువంటి వ్యర్థపు నీరు బయటికి రావటంతో సైడ్ నిర్మాణాలు చేపట్టగా ఒకే చోట నీటి గుంట గా ఏర్పడి దుర్గంధం వెదజల్లడంతో దోమలు వ్యాపించి ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ నేటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ప్రజల్లో తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురవుతున్నాయి.అన్నీ ఉన్న అల్లుడు నోట్లో..చని అన్న చందాగా..పరిస్థితి నెలకొన్నదని రైల్వే కాలనీవాసులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికార పార్టీ అయినప్పటికీ ఈ ప్రాంతం పాలేరు నియోజకవర్గంలో భాగం కావడంతో రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిద్దాం వహించటంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు తమ గెలుపులో కీలక పాత్ర పోషించారు.అయినప్పటికీ ఈ ప్రాంతం ఖమ్మం కార్పొరేషన్ లోనే నెంబర్ వన్ ఒకటో డివిజన్ కావటం అభివృద్ధిలో మాత్రం కొన్ని ఏరియాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రధానంగా రైల్వే కాలనీలోని,1,2,3,4,తదితర రోడ్లు గోతులు ఉండటంతోపాటు సైడ్ ట్రైన్లో లేక ఆ ప్రాంతంలో నివసిస్తున్న అటువంటి ప్రజలు రాత్రి సమయంలో ఆరు బయటకు రావాలంటేనే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చెత్తాచెదారం పారిశుద్ధ చర్యలు సరిగా చేపట్టక ఈ ప్రాంత అభివృద్ధి పై సరిగా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ నాయకులు కానీ దృష్టి సారించక మారుమూల ప్రాంతాలను తలపించే విధంగా అభివృద్ధికి ఆమేడ దూరంలో ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.కార్పొరేషన్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగనుండటంతో రానున్న కాలంలో పోటీ చేసే అభ్యర్థులకు ఈ ప్రాంత ప్రజల నుండి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇంటి పన్ను వాటర్ పన్ను అనేకమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని పన్నులు వసూలు చేసి విద్యుత్తు బిల్లులు విపరీతంగా వసూలు చేస్తూ ప్రభుత్వ పరంగా అన్ని రకాల పన్నులు విధిస్తూ ఈ ప్రాంతం నుండి భారీ స్థాయిలో నిధులు సేకరిస్తున్నటువంటి అధికారులు ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం సరైనది కాదని ఈ ప్రాంత ప్రజలు వారు తీరు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పక్క కార్పొరేషన్ పరిధిలోని వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నప్పటికీ కేవలం కైకొండాయిగూడెం ఒకటో డివిజన్లోని రైల్వే కాలనీ పరిస్థితి అద్వానంగా ఉండటం లక్షలాది రూపాయల వేచించి ఇండ్లను కొనుగోలు చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర ఆవేదనను కలిగిస్తుందని వారు తెలియజేస్తున్నారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంత నాయకులు దృష్టి సారించి ఈ ప్రాంతా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !