+91 95819 05907

మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుని రేసులో నాగేందర్ రెడ్డి

అవకాశం ఇస్తే కొత్తతరాన్ని ముందుకు తీసుకొస్తానంటున్న నాగేందర్ రెడ్డి.

మాసాయిపేట మండలం నేటి గద్దర్ (భూపాల్) మార్చ్ 2.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి మండల కమిటీలు పూర్తికాగా మెదక్ జిల్లాలో అందుకు భిన్నంగా కొన్ని మండలాల్లో ఇప్పటివరకు కొత్తగా బిజెపి మండల నాయకులను ఎన్నుకోవడంలో అలసత్వం వహిస్తున్న మెదక్ జిల్లా బిజెపి నాయకత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే ,మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎంపీ కార్యాలయం ఉండడం బిజెపి నాయకులకు ఒక గట్టి పునాది. కానీ మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకులు కార్యకర్తలలో విభేదాల కారణంగా ఇప్పటివరకు మండల కమిటీ వేయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుని ఒంటెద్దు పోకడల కారణంగా బిజెపి కార్యకర్తలు సహకరించకపోవడంతో ఇప్పటివరకు మండల కమిటీ పూర్తి కాలేదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉండాలని ఓవైపు బిజెపి అధినాయకత్వం నూతన కమిటీలు వేస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సాహిస్తూ, ముందుకు తీసుకొస్తుంటే, మెదక్ జిల్లాలో మాత్రం కొన్ని మండలాల్లో ఇప్పటివరకు పాత నాయకులనే ఉంచడానికి గల కారణం ఏమిటో అర్థం కావడం లేదని, బిజెపి నాయకత్వానికి ప్రతి మండలంలో కొత్త నాయకుల ఎన్నిక ఎంతైన అవసరం ఉందని, కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం ఉన్న పాత నాయకులతో సరిపెట్టుకుందాం అంటే పాత నాయకులతో కలిసి రావడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరని పలుమార్లు జరిగిన మీటింగ్లలో చూసిన విధానమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం మండలంలో ఐదు నుంచి పది మంది వరకే మండల కమిటీకి వస్తున్నారని, అది కూడా ఒకటి రెండు ఊర్ల నుండి మాత్రమే బిజెపి కార్యకర్తలు రావడం ఎంత వరకు సమంజసమని, మిగిలిన గ్రామాల్లో నాయకత్వం బిజెపి పై సదభిప్రాయం ఉన్న మాసాయిపేట మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఇప్పటివరకు నూతనంగా గ్రామ కమిటీలు లేకపోవడం ఎవరి నిర్లక్ష్యమో అంతుపట్టడం లేదని ఊహాగానాలు.అందుకే బిజెపి నూతన మండల కమిటీని వేయడానికి ఎవరు కూడా సహకరిస్తున్నట్టు కనిపించడం లేదు. బిజెపిలో అంతర్గత విభేదాలు ఈ మధ్యకాలంలో బయటపడడంతో ఇప్పటికిప్పుడు మండల కమిటీ వేస్తే మండల అధ్యక్షుని పోటీలో పోతంశెట్టిపల్లి గ్రామం చెందిన సీనియర్ నాయకులు నాగేందర్ రెడ్డి పోటీలో ఉండగా అది జీర్ణించుకోలేని ప్రస్తుత మండల అధ్యక్షుడు మండల కమిటీ ఎన్నికను ఇంకా కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిజెపిలోకి వస్తున్న కొత్త తరాన్ని ఆపుతున్నారని ఊహాగానాలు. మాసాయిపేట మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. జిల్లా కమిటీ తక్షణమే స్పందించి మాసాయిపేట మండలం , చేగుంట మండలం,నార్సింగ్ మండలం, మండల కమిటీ లేసి కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అవేవీ పట్టనట్టు మండల కమిటీ నాయకులు వ్యవహరించడం వల్ల యువనాయకత్వం బిజెపికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాసాయిపేట మండల కేంద్రంలో మండల కమిటీల్లో ఐదు నుండి పదిమంది మాత్రమే ఉండడం కొత్తవారిని ప్రోత్సహించకపోవడం రెండు వర్గాల మధ్య జరుగుతున్న వర్గ విభేదాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పలువురు సీనియర్ బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

◆మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి ◆ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ◆రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో

Read More »

జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి :సీఎం రేవంత్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.* హైదరాబాద్ రవీంధ్రభారతిలో *కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్

Read More »

నస్కల్ వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందజేత

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్

Read More »

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

 Don't Miss this News !