★కొత్త డెరైక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్ వి సూర్యనారాయణ కు వినతి పత్రాన్ని అందించిన ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగేల్లి
నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:
ప్రతి ఏటా సమష్టి కృషితో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తూ మణుగూరు ఏరియా ను అద్భుతమైన ప్రగతి పథంలో నడుపుతున్న కార్మిక వర్గ పిల్లల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి పాఠశాలనుమొదటి విడత పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి 2025_26 విద్యా సంవత్సరంకు గాను సి. బి యస్ ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని కోరుతూ కొత్తడైరెక్టర్ గా పదవి భాధ్యతలు చేపట్టిన ఎల్. వి సూర్యనారాయణ (ఆపరేషన్) కు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.వేంకటేశ్వర్లు వినతి పత్రాన్ని అందించారు..ఆదివారం నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ నందు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి మిఠాయి ద్వారా శుభాకాంక్షలు అందించారు.అనంతరం ఏరియా నందు పలు ప్రయోజనాల అంశాల కల్పన పై వినతి పత్రాన్ని అందించారు.. ఏజెన్సీ ప్రాంతం పబ్లిక్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నడుస్తున్నప్పటికీ స్ధానిక కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సింగరేణి పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అత్యంత అద్భుతమైన కనబరుస్తున్న అంశాన్ని యాజమాన్యం పరిశీలన చేయాలని కోరారు.. మణుగూరు పక్కనే ఉన్న బొగ్గు ఆధారిత పరిశ్రమల పాఠశాలలో సి బి యస్ ఈ సిలబస్ లు నడుస్తున్నాయని తెలిపారు..24 గంటల పాటు నీటి నిల్వలు చేయడానికి సరిపడా గ్యాలెన్స్ లేవని నీటి సరఫరా లో తరుచు వచ్చే అంతరాయల వల్ల కార్మిక వాడల్లో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నీటి నిల్వల పరిమాణం పెంచాలని తెలిపారు..144 బ్యాచ్ కు చెందిన 5 గురు ట్రైనీ ఆపరేటర్ లు దురదృష్టవశాత్తు ఫైనల్ టెస్ట్ లో అనర్హులుగా గుర్తించబడ్డారని వారికి మార్చి 15 లోపు ప్రతిభ పరీక్ష కు అవకాశం కల్పించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో టి బి జి కె యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాని వీర భద్రం,నాయకులు గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస రావు మురళీ కృష్ణ, ఇమ్రాన్,కళ్యాణ్, సుధాకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు