★ శ్వేత నాగు ప్రాణాలు కాపాడాలి
★ సామాజిక కార్యకర్త బోడ లక్ష్మణ్ రావు
నేటి గదర్ న్యూస్, పినపాక:
పినపాక మండలం ఉప్పాక గ్రామం UPS పాఠశాల దగ్గర గల పురాతన బావిలో 6 అడుగుల శ్వేతనాగు గత మూడురోజుల నుండి బావిలోనే ఉంది.. స్కూల్ విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది.ఇది ఇలా ఉండగా పినపాక మండలానికి చెందిన సామాజిక కార్యకర్త బోడ లక్ష్మణ్ రావు ఆ స్వేత నాకు బావిలో పడి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ… తక్షణమే అధికారులు, ప్రాణదాతలు నాగును బయటకు తీయగలరు. లేకపోతే రేపు కొత్తగూడెం ప్రజావానిలో ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు.
Post Views: 1,225









