నేటి గదర్ న్యూస్,పినపాక:
ప్రమాదాల నివారణకు వాహనాల వెనుక భాగంలో తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు వేయించాలని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో సీతారాంపురం గ్రామం వద్ద ట్రాక్టర్లను ఆపి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేడియం స్టిక్కర్లు వేయించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ రాత్రి వేళల్లో ట్రాక్టర్ ట్రక్ వెనక భాగం కనపడక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా వాహన యజమానులు తమ వాహనాల వెనుక రేడియం స్టిక్కర్లు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 201









