నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి,
15 సంవత్సరాల క్రితం మన ప్రజా నాయకుడు మధిర శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మున్నేరు నది ప్రక్కన రాళ్ల మధ్య, ముళ్ళకంపలు, పొదలను దాటి, కాలిబాట కూడా లేని మార్గంలో పండ్రేగిపల్లి నుండి పెద్దమండవ వరకు నడుస్తూ ప్రజలను కలుస్తూ వారి ఇబ్బందులను తెలుసుకుంటు మున్నేరు నది ఒడ్డున సాగిన పాదయాత్ర.
ఆ మార్గం గుండా వెళ్లడమే ఒక సవాలుగా ఉండేది. కానీ, అభివృద్ధి పట్ల గల సంకల్పం, ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలనే దృఢచిత్తం ఆ రోజు ఒక గొప్ప నిర్ణయంగా మారింది.
ఆ సంకల్పమే నేడు కార్యరూపం దాల్చి, మున్నేరు నదికి ఇరువైపులా పండ్రేగిపల్లి నుండి మల్కాపురం వరకు, గాంధీనగర్ నుండి పోలంపల్లి వరకు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టేలా మారింది.
భట్టి విక్రమార్క నాయకత్వంలో ఈ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవడం, పనులు వేగంగా సాగుతూ, ముఖ్యంగా పండ్రేగిపల్లి నుండి మల్కాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసినట్టైంది, గాంధీనగర్ టు పోలంపల్లి వరకు రాబోయే 4 నెలల్లో బిటీ రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది.
ఈ రోడ్డు నిర్మాణం ద్వారా గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది. ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయి. విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఒకప్పుడు కష్టసాధ్యమైన ప్రయాణ మార్గం, వర్షం వస్తే నానా ఇబ్బందులు పడుతూ, సైకిల్ మోటార్ మీద వెళుతూ కింద పడిన భయంకరమైన రోజులను రూపుమాపుతూ, నేడు సౌకర్యవంతమైన రహదారిగా మార్చి, అభివృద్ధికి మార్గదర్శకంగా ఈ బాటలు నిలుస్తున్నాయి.
ఈ గొప్ప అభివృద్ధి యజ్ఞంలో ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన భట్టి విక్రమార్క కి ముదిగొండ మరియు చింతకాని మండల ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి, మరెన్నో గ్రామాల నవనిర్మాణానికి కారణం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
భట్టి విక్రమార్క అభివృద్ధికి చిరునామా – కృతజ్ఞతలతో
ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు.