నేటి గదర్ న్యూస్ ప్రతినిధి, భద్రాచలం:
గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ ఎంపీ నర్సారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుండి ఏడో తేదీ వరకు జరుగుతున్న కరపత్ర క్యాంపియన్ లో భాగంగా పంచాయతీ కార్మికులకు కరపత్రాల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవరించి నూతన జీవోలు ఉన్నప్పటికీ 12 నుంచి 18 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు కనీస వేతనాలు ను సవరిస్తూ జీవో విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్య కారణంగా కార్మికుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా జీఓ ను సవరించి 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలో పని చేస్తే కార్మిక కుటుంబాలలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పెన్షన్లు మంజూరు చేయాలని తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని రిటైర్మెంట్ తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని నర్సారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు కార్మికులు శ్రీనివాస్, సాయి, చెన్నకేశవులు, అనసూయ, సుశీల, రజినీకాంత్, గురవమ్మ ,వెంకటమ్మ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు