◆ఓక తల్లి కడుపున పుట్టి ఒక తల్లి పాలు తాగిన బంధాలు మానవత్వం మంట కలుపుతున్న కోపాలు దూరమైతున్న బంధాలు
మాసాయిపేట మండలం నేటి గద్దర్ (భూపాల్) మార్చి 4.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సొంత అన్నని చంపిన సంఘటన మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. పూర్తి పూర్తి వివరాల్లోకెళ్తే
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని దుంపల చందు, దుంపల మహేష్, ఇద్దరు అన్నదమ్ములు వీరికి తల్లిదండ్రులు మరణించిన తర్వాత అన్నదమ్ముల ఇద్దరిని వారి భార్యలు కూడా వదిలి వేయడంతో ఓకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్న అన్నదమ్ములు సోమవారం రాత్రి చందు కూరగాయలు తీసుకోవడానికి ఊర్లోకి వెళ్లి మద్యం తాగి ఇంటికి లేటుగా వెళ్ళగా చందు అన్న మహేష్ లేటు వచ్చినందుకు అన్నదమ్ములు కొట్లాడుకున్నారని విశ్వంనీయ సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటికి పెద్ద కొడుకును నిన్ను చంపేస్తే ఉన్న ఆస్తి మొత్తం నాకే అయితది అని అన్న మహేష్ను గొంతు పిసికి చంపివేసి వైరు మెడకు వేసుకొని ఉరివేసుకున్నట్లు ఆత్మహత్యగా తమ్ముడు. ఈ రోజుల్లో కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ములు ఈ విధంగా వ్యవహరించడం సభ్య సమాజం తలదించుకోవడానికి నిదర్శనం దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చైతన్ కుమార్ రెడ్డి తెలిపారు.