నేటి గదర్ న్యూస్,
భద్రాచలం, మార్చి 4, : రోజురోజుకు దేశంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై శ్రద్ధ చూపని కేంద్ర ప్రభుత్వం దళితుల వర్గీకరణపై ప్రత్యేక దృష్టి సారించడం అభ్యంతరకరమని భద్రాద్రి కొత్తగూడెం జాతీయ మాల మహానాడు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి అన్నారు.మంగళవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన అభ్యుదయ భవనంలో భద్రాచలం మండల జాతీయ మాల మహానాడు మహిళా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా జిల్లా అధ్యక్షులు రమణమూర్తి,జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి,జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, పలువురు నాయకులతో కలిసి భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం గిరిజన అభ్యుదయ భవనంలో జిల్లా మహిళా నాయకురాలు మద్దెటి జయమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ చింతిర్యాల రవికుమార్ మాట్లాడుతూ దళితులంతా ఐక్యతగా ఉండి రిజర్వేషన్ శాతాన్ని పెంచేలా ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని కోరారు.జిల్లా నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రమణమూర్తి జిల్లాలో అన్ని మండలాల్లో పర్యటిస్తూ దళితుల సమస్యలను వెలికితీస్తూ మాలల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.అనంతరం జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, ఆకృత్యాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తుండటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం మహిళ చట్టాలను అమలు చేయడంలో జాప్యం చేస్తూ, దళితుల వర్గీకరణ పై ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ పై దృష్టి సారించడం మాని, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులంతా ఐక్యతగా ఉండి రిజర్వేషన్ శాతాన్ని పెంచుకునేలా కృషి చేయటానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడేళ్ల గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్,జిల్లానాయకురాలు శెట్టి జయమ్మ, భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కారంపూడి సాల్మన్, పలువురు మహిళా నాయకురాళ్లు, నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
