.
*ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం*
*వలస ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ*
నేటి గదర్ కరకగూడెం: ప్రేమతో నిండిన హృదయమే నిజమైన సంపదని కరకగూడెం ఎస్సై రాజేందర్ అభిప్రాయపడ్డారు.మంగళవారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో మండలంలోని అంగోరుగూడెం వలస ఆదివాసీ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సై పాల్గొని సుమారు 50 కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….సమాజ సేవలో ఎనలేని సంతృప్తి దాగివుంటుందని ప్రతీ ఒక్కరూ ప్రస్తుత రోజుల్లో అభాగ్యులకు ఏదో రూపంలో అండగా నిలబడలన్నారు.
అంతేకాకుండా ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయంమని ప్రసంసించారు.అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ..ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు,పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
