రామాయంపేట నేటి గద్దర్ ప్రతినిధి మార్చి 4:- మెదక్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరచిన అభ్యర్థి మల్క కొమురయ్య అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పట్ల మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్, వివేకానంద, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి విజయం పట్ల పట్టణంలో ప్రధాన రహదారి గుండా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.తదనంతరం బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారిపై బిజెపి నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్,సిద్ధ రాములు మండల బిజెపి అధ్యక్షులు నవీన్ గౌడ్,పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి,చింతల శేఖర్,కటికే కార్తీక్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
